28-12-2025 12:00:00 AM
మిస్ టీన్
తెలంగాణ.. ప్రీతి
ప్రీతి యాదవ్ భద్రాచలంలో 8వ తరగతి చదువుతోంది. తండ్రి పానీ పూరి అమ్మే వ్యక్తి. తల్లి సాధారణ గృహిణి. తల్లికి మోడలింగ్‌పై అవగాహన ఉండటంతో కుమార్తెను ప్రోత్సహించింది. రాజస్థాన్‌లో గతేడాది జరిగిన ‘ఫేవరెట్ మిస్ టీన్ ఇండియా’ పోటీలకు తీసుకెళ్లింది. ఇటీవల జరిగిన గ్రాం డ్ ఫినాలేలో ఆ బాలిక టైటిల్‌ను గెలిచి, ‘మిస్ టీన్ తెలంగాణ’గా నిలిచింది.
ఎన్నాళ్లో వేచిన
‘తారిఖ్’ హృదయం !
బంగ్లాదేశ్ రాజకీయాల్లో పెనుమార్పు చోటుచేసుకుంది. ఆ దేశ మాజీ ప్రధాని ఖలీదా జియా కుమారుడు తారిఖ్ రెహమాన్ 17 ఏళ్ల తర్వాత స్వదేశానికి వచ్చారు. ఆయనకు లక్షలాది మంది ప్రజలు ఘనస్వాగతం పలికారు. వచ్చే ఏడాది జరిగే ఎన్నికల్లో ఆయన ప్రధాని రేసులో ఉన్నారు. ప్రస్తుతం ఆయన బీఎన్పీ సారథ్య బాధ్యతలు చూస్తున్నారు.