calender_icon.png 6 February, 2026 | 9:19 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సుమతీ శతకంలో ప్రతి పాత్రా హీరోనే!

06-02-2026 02:15:38 AM

అమర్‌దీప్ చౌదరి, శైలి చౌదరి జంటగా నటించిన క్లీన్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘సుమతీ శతకం’. ఎంఎం నాయుడు దర్శకత్వంలో విజన్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై సాయి సుధాకర్ కొమ్మాలపాటి నిర్మించారు. తెలుగు రాష్ట్రాల్లో మైత్రి మూవీ మేకర్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్న ఈ చిత్రం ఫిబ్రవరి 6న విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్రబృందం గురువారం మీడియా సమావేశం నిర్వహించింది.

ఈ ప్రెస్‌మీట్‌లో చిత్ర కథానాయకుడు అమర్‌దీప్ మాట్లాడుతూ.. “ఒకే ఛాన్స్ ఇవ్వండి. నాకు ఈ సినిమాతోనే మంచి పేరు రావాలని కోరుకుంటున్నా. ఈ సినిమా అందరికీ నచ్చుతుంది. ఈ సినిమాలో ప్రతి పాత్రా హీరోనే” అన్నారు. ‘ఈ సినిమాలో నా పాత్ర పూర్తిగా రెవీల్ చేయలేదు. కానీ, నా పాత్ర చూసి కచ్చితంగా అందరూ కనెక్ట్ అవుతార’ని  హీరోయిన్ శైలి చెప్పారు. దర్శకుడు ఎంఎం నాయుడు మాట్లాడుతూ.. “ఈ సినిమా కోసం టీమ్ అందరూ చాలా కష్టపడి సపోర్ట్ చేస్తూ వచ్చారు. ప్రేక్షకులు మంచి విజయాన్ని అందిస్తారని కోరుకుంటున్నా” అన్నారు.

నిర్మాత కొమ్మలపాటి సాయి సుధాకర్ మాట్లాడుతూ.. “ఈ సినిమా పై మాకు నమ్మకం ఉంది. టికెట్ ధర అందరికీ అందుబాటులో సింగిల్ థియేటర్‌లో రూ.100, మల్టీప్లెక్స్‌లో రూ.150 మాత్రమే ఉంటుంది” అని తెలిపారు. ఇంకా ఈ కార్యక్రమంలో నటీనటులు శైలజ, టేస్టీ తేజ, సంగీత దర్శకుడు సుభాష్ ఆనంద్, జేడీవీ ప్రసాద్, రైటర్ నాయుడు పాల్గొన్నారు.