వ్యక్తిత్వ నిర్మాణ ప్రారంభోత్సవం
- పుస్తకావిష్కరణ కార్యక్రమం
- శ్రీ చైతన్య విద్యా సంస్థల ఆధ్వర్యంలో నిర్వహణ
హైదరాబాద్, ఆగస్టు 13(విజయక్రాంతి): విద్యార్థులకు విద్యాభాస్యంతో పాటు మంచి వ్యక్తిత్వాన్ని, నైతిక విలువలను, క్రమశిక్షణను, దేశభక్తిని పెంపొందించేందుకు శ్రీ చైతన్య వి ద్యా సంస్థల చైర్‌పర్సన్ డాక్టర్ ఝాన్సీ లక్ష్మీబాయిచే గురువారం కానూరు ఐపీఎల్ క్యాంపస్‌లో వ్యక్తిత్వ నిర్మాణ కార్యక్రమం, పు స్తకావిష్కరణ వేడుక ఘనంగా ప్రారంభించా రు.
ఈ సందర్భంగా విద్యార్థుల సమగ్ర వికాసానికి దోహదపడే ప్రత్యేక పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఝాన్సీ మేడం మాట్లాడుతూ వి ద్యార్థుల్లో చిన్నప్పటి నుంచి చదువుతోపా టు సంస్కారం పెంపొందిస్తూ భారతీయ సంస్కృతి సంప్రదాయాలు, గురువులు, పెద్ద లు, తల్లిదండ్రులు, సమాజం పట్ల గౌరవ మ ర్యాదలు పెంపొంది న్యాయం, ధర్మం మొదలైన విషయాలు తెలుసుకోవాలన్నారు.
కార్యక్రమంలో భాగంగా ఇ.జి.యమ్ మురళీకృష్ణ, ఆలిండియా అకడమిక్ కోఆర్డినేటర్ బీవీ సతీష్, రీజినల్ ఇన్‌చార్జెస్, ప్రిన్సిపాల్స్, డీన్స్, సెంట్రల్ ఆఫీస్ టీమ్, ఉపాధ్యాయ, విద్యార్థినీ విద్యార్థుల బృందం పాల్గొన్నారు.






