14 August, 2026 | 1:33 AM

శ్రావణమాసం తొలి పూజలో డీసీపీ రాజా మహేంద్రనాయక్

14-08-2026 12:00 AM

జనగామ, ఆగస్టు 13 (విజయక్రాంతి): శ్రావణమాసం సందర్భంగా శ్రీ ఉమా మహేశ్వర దేవాలయంలో డీసీపీ రాజా మహేంద్ర నాయక్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు సాంబమూర్తి శర్మ ఆధ్వర్యంలో డీసీపీ రాజా మహేంద్ర నాయక్ చేతుల మీదుగా ఉమామహేశ్వర స్వామివారి లింగానికి అభిషేకం, పుష్పార్చన నిర్వహించి ప్రత్యేక హారతి ఇచ్చారు. అనంతరం అర్చకులు సాంబమూర్తి శర్మ డీసీపీ కి శ్రీ ఉమామహేశ్వర స్వామి వారి ఆశీస్సులు అందించి తీర్థ,ప్రసాదాలు అందజేశారు. శ్రావణమాసంలో స్వామి వారి దర్శనం చేసుకోవడం ఆనందంగా ఉందని డీసీపీ పేర్కొన్నారు.  ఈ కార్యక్రమంలో వర్ధన్నపేట ఏసీపీ అంబాటి నరసయ్య పాల్గొన్నారు.