అయ్యప్ప ఆలయ రజతోత్సవానికి అంకురార్పణ
అయ్యప్ప ఆలయంలో లక్ష పుష్పార్చన
మెదక్, జూన్ 14 (విజయక్రాంతి): వేద బ్రాహ్మణుల రుద్ర పారాయణం... మాధవానంద సరస్వతీ స్వామి అనుగ్రహ భాషణం... భక్తుల కోలాహలం నడుమ పట్టణంలోని అయ్యప్ప స్వామి దేవాలయ రజతోత్సవ వేడుకలు ఆదివారం వైభవంగా జరిగాయి.
ఆలయం స్థాపించి 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా రజతోత్సవాల్లో భాగంగా తొలిరోజు అయ్యప్ప, గణపతి, సుబ్రమణ్యం స్వాముల విగ్రహాల అలంకరణ, మహాభిషేకం నిర్వహించారు. అనంతరం ఆలయంలో విగ్రహాలకు మాధవానంద సరస్వతీ స్వామి, మధుసూదనానంద స్వామి ప్రత్యేక పూజలు చేశారు.
ఈ సందర్భంగా వేద బ్రాహ్మణులు 1,365 రుద్ర పారాయణాలు, శ్రీ సూక్త పారాయణం నిర్వహించారు. అనంతరం లక్ష లక్ష రూపాయలు పుష్పార్చన అత్యంత వైభవంగా జరిగింది. మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. లక్ష పుష్పార్చన అనంతరం అయ్యప్ప స్వామికి పుష్ప సమర్పణ చేశారు. సాయంత్రం మహిళల చేత గణపతి స్తోత్రం పారాయణం నిర్వహించారు. అయ్యప్ప ఆలయంలో లక్ష పుష్పార్చన అనంతరం మాధవానంద స్వామి అనుగ్రహ భాషణం చేశారు.
తల్లిదండ్రులకు సేవ చేయాలని, వారితో కొద్దిసేపు గడపాలని సూచించారు. కార్యక్రమంలో అష్టకాల విద్యా మనోహర్ శర్మ, ఆలయ సేవకుడు వైద్య రాజు, వేద పండితులు వైద్య శ్రీనివాస్ , అశోక్ , పట్టణ సీఐ మహేష్, మున్సిపల్ మాజీ చైర్మెన్ చంద్రపాల్, మాజీ వైస్ చైర్మన్ రాగి అశోక్, అయ్యప్ప సేవా సమాజం బాధ్యులు వీర్ కుమార్ , రాగి చక్రపాణి , గంగ లక్ష్మీపతి, కొండ శ్రీనివాస్ , పురం వెంకట్ నారాయణ, ఉప్పల శ్రీనివాస్ యచం చిన్నరాజు, శ్రీకాంత్ రెడ్డి, రాధాకృష్ణ, రమేష్, ప్రభుగౌడ్, కిషన్, బచ్చుపార్థివనాథ్ పాల్గొన్నారు.






