3 July, 2026 | 2:06 AM

రూరల్ పాస్టర్స్ అసోసియేషన్ కార్యాలయం ప్రారంభం

03-07-2026 12:10 AM

ముఖ్యఅతిధిగా పాల్గొన్న మున్సిపల్ చైర్‌పర్సన్ సమత 

చేవెళ్ల జూలై 2 (విజయక్రాంతి): చేవెళ్ల నియోజకవర్గ రూరల్ పాస్టర్స్ అసోసియేషన్ నూతన కార్యాలయ ప్రారంభోత్సవంలో మున్సిపల్ ఛైర్పర్సన్ దేవర సమతా వెంకట్ రెడ్డి పాల్గొన్నారు. రంగారెడ్డి జిల్లా పరిధిలోని వివిధ మండలాల పాస్టర్లకు సేవలు అందించేందుకు చేవెళ్ల హెడ్క్వార్టర్లో నూతన కార్యాలయాన్ని ప్రారంభించారు. 

ముఖ్య అతిథిగా పాల్గొన్న సమతా మాట్లాడుతూ... నియోజకవర్గంలోని వివిధ మండలాల పాస్టర్లు ఎదుర్కొనే సమస్యలను ఒకే వేదికపై పంచుకునేందుకు అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు ఈ కార్యాలయం వేదికని తెలిపారు. పాస్టర్లకు తమకంటూ ఒక కార్యాలయం ఏర్పాటు కావడం అభినందనీయమని, ఇది వారి సేవా కార్యక్రమాలకు మరింత తోడ్పడుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో చేవెళ్ల మున్సిపల్ 17 వార్డు కౌన్సిలర్ కృష్ణా నాయక్, చేవెళ్ల మాజీ ఉప సర్పంచ్ టేకులపల్లి శ్రీనివాస్ యాదవ్, వార్డు సభ్యులు పాల్గొన్నారు.