సొంత నిధులతో బడిబాట
బాలికల పాఠశాలలో సభా వేదిక, నూతన గదుల ప్రారంభం
ఇబ్రహీంపట్నం, ఆగస్టు 20 (విజయక్రాంతి): స్థానిక బాలికల యుపిఎస్ పాఠశాల విద్యాభివృద్ధికి బి ఆర్ ఆర్ ఫౌండేషన్ అధినేత తమ దాతృత్వం చాటుకున్నారు. ఫౌండేషన్ ఆధ్వర్యంలో రూ. 6 లక్షల సొంత నిధులతో నిర్మించిన నూతన సభా వేదిక, తరగతి గదులను బూడిద రామ్ రెడ్డి గురువారం ఘనంగా ప్రారంభించారు.
పాఠశాల విద్యార్థుల సౌకర్యార్థం రూ. 6 లక్షలతో చేపట్టిన నిర్మాణాలను ప్రారంభించడంతో పాటు పాఠశాల ప్రాంగణంలో మొక్కలు నాటారు. యువత, విద్యార్థులు చెడు వ్యసనాలకు దూరంగా ఉంటూ, క్రమశిక్షణతో చదివి తల్లిదండ్రులకు, గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని రామ్ రెడ్డి ఆకాంక్షించారు. కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్లు, మాజీ ప్రజాప్రతినిధులు, ఉపాధ్యాయులు, ఫౌండేషన్ సభ్యులు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.






