సన్న బియ్యాన్ని పారదర్శకంగా పంపిణీ చేయాలి
21-08-2026 12:00 AM
జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్
బోయినిపల్లి, ఆగష్టు -20: ప్రభుత్వం నిర్దేశించిన మేరకు రేషన్ కార్డు లబ్ధిదారులకు సన్న బియ్యాన్ని పారదర్శకంగా పంపిణీ చే యాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ అధికారులను ఆదేశించారు. గురువారం రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిననపల్లి మండల కేం ద్రంలోని చౌక ధరల దుకాణాన్ని జిల్లా కలెక్టర్ గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.
లబ్ధిదారులకు మూడు నెలలకు సంబంధించిన సన్న బియ్యం పంపిణీ జరుగుతున్న తీ రును పరిశీలించారు.మూడు నెలలకు సం బంధించిన సన్న బియ్యం పంపిణీ, ఆన్లైన్లో లబ్ధిదారుల వివరాల నమోదు గురించి ఆరా తీశారు.. ఇప్పటివరకు ఎంతమంది లబ్ధిదారులకు సన్న బియ్యం పంపిణీ చేశారనే వివ రాలను అడిగి తెలుసుకున్నారు.తనిఖీలో తహసీల్దార్ షరీఫుద్దీన్, తదితరులు ఉన్నారు.






