ఆగని పులి దాడులు
07-12-2024 04:35 PM
కుమ్రం భీం అసిఫాబాద్ (విజయక్రాంతి): జిల్లాలో పులి దాడులు కొసాగుతున్నాయి. రోజురోజుకి ఏదో ఒకచోట దాడులు చేస్తున్న ఘటనలతో కలకలం రేపుతుంది. శనివారం ఆసిఫాబాద్ మండలంలోని గంటలగూడ గ్రామ సమీపంలో ఒక ఆవుని హతమార్చింది. ఘటన స్థలానికి చేరుకున్న ఆటో శాఖ అధికారులు పులి దాడి చేసినట్లుగా బాధిత రైతు బానోత్ రాములుకు తక్షణ సాయం రూ.5 వేలు అందించిన ఫారెస్ట్ అధికారులు. అనంతరం వారు మాట్లాడుతూ.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పులి మళ్లీ ఘటన స్థలానికి వచ్చే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. ఘటన స్థలంతో పాటు మరికొన్నిచోట్ల సీసీ కెమెరాను ఏర్పాటు చేనున్నట్లు పేర్కొన్నారు.




