1 April, 2026 | 4:38 AM

మల్లాపూర్ డివిజన్ ను దశల వారిగా అభివృద్ధి చేస్తా..

07-12-2024 04:31 PM

కాప్రా: కాప్రా సర్కిల్ పరిధిలోని మల్లాపూర్ డివిజన్ ను అన్ని రంగాలలో అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి పేర్కొన్నారు. మల్లాపూర్ డివిజన్ పరిధిలోని న్యూ భవాని నగర్ కాలనీలో 25 లక్షల నిధులతో చేపట్టిన భూగర్భ డ్రైనేజీ పనులను ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి, స్థానిక కార్పొరేటర్ దేవేందర్ రెడ్డి, జలమండలి మేనేజర్ సిరాజుద్దీన్ తో కలిసి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నియోజకవర్గ పరిధిలోని డివిజన్లోని కాలనీలా సమగ్ర అభివృద్ధికి నిధులు కేటాయించి అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు. డివిజన్లో సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకువస్తే వెంటనే పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక కాలనీ వాసులు ధర్మారెడ్డి, కుంటి కృష్ణ, ఇస్మాయిల్, ముత్యంరెడ్డి, జమ్మయ్య, వెంకటరెడ్డి, మధు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఫైళ్ల ప్రవీణ్ కుమార్, ఉస్మాన్, సీతాల వీరస్వామి, రఘు, శ్రీనివాస్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.