1 April, 2026 | 7:20 AM

ఘనంగా ఫోర్స్ ఫ్లాగ్ డే వేడుకలు..

07-12-2024 04:38 PM

వీరమరణం పొందిన సైనికుని కుటుంబానికి చెక్కును అందజేసిన జిల్లా కలెక్టర్...

ఆదిలాబాద్ (విజయక్రాంతి): ఆర్మడ్ ఫోర్స్ ఫ్లాగ్ డే సందర్భంగా ప్రాంతీయ సైనిక సంక్షేమ కార్యాలయం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. మాజీ సైనికులు, ఎన్.సీ.సీ క్యాండిడేట్స్, విద్యార్థుతో కలెక్టర్ క్యాంప్ ఆఫీసులో శనివారం చేపట్టిన కార్యక్రమంలో కలెక్టర్ రాజర్శి షా పాల్గొని ఫ్లాగ్ డే స్టిక్కర్స్ అతికించగా, విరాలన్ని అందించారు. మాజీ సైనికులు, ఎన్.సీ.సీ క్యాండిడేట్స్, విద్యార్థులు పట్టణ పురవీధుల్లో, స్కూళ్లలో తిరుగుతూ విరాళాలను సేకరించారు. అదేవిధంగా యుద్ధంలో చనిపోయిన సైనికుల కుటుంబాలను సన్మానించారు. అమరులైన సైనికుని కుటుంబ సభ్యులకు 3 లక్షల చెక్కును కలెక్టర్ అందజేశారు. కార్యక్రమంలో జిల్లా సైనిక సంక్షేమ అధికారి వెంకటేశ్వర్లు, మాజీ సైనికుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు శంకర్ దాస్, పలువురు మాజీ సైనికులు తదితరులు పాల్గొన్నారు.