calender_icon.png 16 August, 2025 | 6:07 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎస్ఆర్ఆర్ జలాశయం పెరిగిన 9.718 టీఏంసీల నీటి సామర్థ్యం

16-08-2025 04:50:07 PM

బోయినపల్లి (విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా(Rajanna Sircilla District)లోని బోయినపల్లి మండలం మాన్వాడ శ్రీ రాజరాజేశ్వర జలాశయం(Sri Rajarajeshwara Reservoir) నీటిమట్టం ప్రస్తుతం పడుతున్న వర్షాలతో పెరిగింది. శనివారం మధ్యాహ్నం వరకు 9.718 టీఎంసీల నీటి నిలువకు చేరింది. గత ఐదు రోజులుగా కురుస్తున్న వర్షాలతో ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి కరీంనగర్ జిల్లా రామడుగు మండలం గాయత్రి పంప్ హౌస్ కు ఇంజనీరింగ్ అధికారులు నీటిని పంపిస్తున్నారు. అక్కడ నుంచి మోటార్ల ద్వారా వరద కాలువ నుంచి మానువాడ శ్రీ రాజరాజేశ్వర జలాశయంకు ఇంజనీరింగ్ అధికారులు నీటిని విలువ చేయగా ఈ మేరకు జలాశయంకు చేరుతుంది. శనివారం జలాశయంకు 12వేల క్యూసెక్కుల నీరు లాగా, మూలవాగు వరదల నుంచి 9450 క్యూసెక్కుల వరదనీరు వచ్చినట్లు వారు తెలిపారు. జలాశయం సామర్థ్యం 27.55 టీఎంసీలకు గాను ప్రస్తుతం 9. 718 టీఎంసీల నీటి నిలువకు చెరుకున్నట్లు వారు తెలిపారు. జలాశయంకు రామడుగు మండలం లక్ష్మీపూర్ గాయత్రి పంప్ హౌస్ నుంచి నీటి విడుదల కొనసాగుతుంది.