calender_icon.png 16 August, 2025 | 7:45 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆరోగ్య సంరక్షణ కోర్సులు దూర విద్యలో నిషేధంపై పునరాలోచన చేయాలి

16-08-2025 06:05:16 PM

అంబేడ్కర్ ఓపెన్ యూనివర్శిటీ పూర్వ విద్యార్థుల అసోసియేషన్ సభ్యుడు డాక్టర్ అట్ల శ్రీనివాస్ రెడ్డి

కొత్తపల్లి,(విజయక్రాంతి): ఆరోగ్య సంరక్షణ కోర్సులు దూర విద్య లో నిషేధం పై పునరాలోచన చేయాలి అని  డా. బి.ఆర్. అంబేడ్కర్ ఓపెన్ యూనివర్శిటీ పూర్వ విద్యార్థుల అసోసియేషన్ సభ్యుడు డా. అట్ల శ్రీనివాస్ రెడ్డి ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ 592వ సమావేశంలో నేషనల్ కమిషన్ ఫర్ అలైడ్, హెల్త్ కేర్ ప్రొఫెషన్ చట్టం 2021 పరిధిలో ఉన్న హెల్త్‌కేర్, అలైడ్ సబ్జెక్టు లను ఓపెన్ అండ్ డిస్టెన్స్ లెర్నింగ్ లేదా ఆన్‌లైన్ మోడ్ ద్వారా అందించరాదని నిర్ణయించి జూలై, ఆగస్టు 2025 అకడమిక్ సెషన్ నుండి అమలులోకి  వస్తుందని  సైకాలజీ, మైక్రోబయాలజీ, ఫుడ్ అండ్ న్యూట్రిషన్ సైన్స్, బయోటెక్నాలజీ, క్లినికల్ న్యూట్రిషన్ & డైటెటిక్స్ వంటి కోర్సులు ఇకపై ఓపెన్ డిస్టెన్స్ లర్నింగ్ లేదా ఆన్‌లైన్‌లో అనుమతించబడవు అని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ తీసుకున్న నిర్ణయం పై పునరాలోచన చేయాలని కోరారు.