calender_icon.png 16 August, 2025 | 7:49 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సబ్బండ వర్గాల ఉద్యమ కెరటం కొరివి కృష్ణ స్వామి ముదిరాజ్

16-08-2025 05:55:16 PM

సిద్దిపేట,(విజయక్రాంతి): కొరివి కృష్ణ స్వామి ముదిరాజ్ సబండ వర్గాలకు ఉద్యమ నాయకుడని, ఆయన ఆశయాలకు అనుగుణంగా ప్రతి ముదిరాజ్ బిడ్డ పోరాటం చేయాలని ముదిరాజ్ హక్కుల సాధన సమితి రాష్ట్ర అధ్యక్షులు జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్ అన్నారు. శనివారం సిద్దిపేట పట్టణంలోని కొరివి కృష్ణస్వామి ముదిరాజ్ విగ్రహానికి ముదిరాజ్ హక్కుల సాధన సమితి నాయకులు మేడికాయల వెంకటేశం, పడిగే ప్రశాంత్, చింతమడక రాజన్న, టీచర్ రాజయ్యలు పూలమాలవేసి నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్ మాట్లాడుతూ... 1933 లోనే రజాకార్ల పాలనలో హైదరాబాద్ నగరానికి రూపురేఖలను తీర్చిదిద్దిన ఫలితమే నేటి హైదరాబాద్ నగరంగా ఉందని అందుకు కొరివి కృష్ణ ప్రత్యేక కృషి ఉందన్నారు. కొరివి కృష్ణ ముదిరాజ్ జాతికే నాయకుడు కాదని సబ్బండ వర్గాల కోసం ఆయన కార్పొరేటర్, మేయర్, రిపోర్టర్, కవిగా, విప్లవకారునిగా సేవలు అందించారని వివరించారు.