16-08-2025 05:47:19 PM
సిపిఎం మండల కార్యదర్శి సత్రపల్లి సాంబశివరావు..
మణుగూరు (విజయక్రాంతి): సింగరేణి కార్మిక వాడల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టి మౌలిక వసతులు కల్పించాలని, సిపిఎం మండల కార్యదర్శి సత్రపల్లి సాంబశివరావు(CPM Mandal Secretary Sambasiva Rao) యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు. శనివారం పీవీ కాలనీలో జరిగిన ఆ పార్టీ శాఖ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఆరోగ్యాన్ని, ప్రాణాన్ని సైతం పక్కనబెట్టి చెమటోడుస్తున్న నల్లసూర్యుల కార్మిక వాడల అభివృద్ధిపై అధికారులు నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారని విమర్శించారు.
యాజమాన్యానికి లాభాలపై ఉన్న శ్రద్ధ కార్మికుల సంక్షేమంపై లేదని ఆరోపించారు. పీవీ కాలనీలో కార్మికులు నివసించే ఇళ్లపై చెట్లు మొలిసీ బీటలు బారుతు న్నాయని, ఆయా ఇళ్లల్లో కార్మిక కుటుంబాలు నివసించాలంటే భయ భ్రాంతులకు గురవుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కార్మికులు యాజమాన్యానికి ఎన్ని సార్లు మొరపెట్టుకున్న పట్టించుకునే పరిస్థితులలో అధికారులు లేరని మండిపడ్డారు. తక్షణమే కార్మిక వాడలలో సమస్యలను పరిష్కరించాలన్నారు. లేనిచో పార్టీ ఆధ్వర్యంలో ప్రత్యక్ష ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరిం చారు. కార్యక్రమంలో నాయకులు మాచారపు లక్ష్మణరావు, నైనారపు నాగేశ్వరరావు, నల్లెల విల్సన్, ముత్యాల సుమన్, చీమల రాంబాబు పాల్గొన్నారు.