16-08-2025 05:43:56 PM
బెల్లంపల్లి (విజయక్రాంతి): బెల్లంపల్లి రైల్వే స్టేషన్(Bellampally Railway Station)లో శుక్రవారం అర్ధరాత్రి ఆర్ పిఎఫ్ పోలీసులు రైలులో అక్రమంగా తరలిస్తున్న ఐదు క్వింటాళ్ల పిడిఎస్ బియ్యాన్ని పట్టుకున్నారు. బెల్లంపల్లి నుండి మహారాష్ట్ర వెళ్లే అజ్ని ప్యాసింజర్ రైలులో గుర్తు తెలియని వ్యక్తులు బియ్యాన్ని తరలిస్తున్నారనే పక్క సమాచారం అందడంతో ప్యాసింజర్ రైలులో తనిఖీలు నిర్వహించినట్లు ఆర్ పి ఎఫ్ ఏ ఎస్ ఐ మోహన్ రాథోడ్ తెలిపారు. రామగుండం ఆర్ పి ఎఫ్ ఇన్స్పెక్టర్ లింగమయ్య ఆదేశాలతో తనిఖీలు నిర్వహించినట్లు ఏ ఎస్ ఐ మోహన్ రాథోడ్ చెప్పారు. పట్టుబడ్డ పిడిఎస్ బియ్యం విలువ రూ 18000 ఉంటుందని ఆయన చెప్పారు.