calender_icon.png 16 August, 2025 | 7:46 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇందిరమ్మ ఇల్లు నిర్మాణ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే మదన్ మోహన్

16-08-2025 05:56:48 PM

కామారెడ్డి (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గ ఎమ్మెల్యే మదన్ మోహన్(MLA Madan Mohan Rao) శనివారం సదాశివనగర్ మండలంలోని తిర్మానపల్లి, కల్వరాల్, పద్మజీవాడి, మోడేగావ్, ధర్మరావుపేట, అమర్లబండ గ్రామాలను సందర్శించారు. ఈ సందర్భంగా గ్రామాల్లో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇళ్లను పరిశీలించి, లబ్ధిదారులతో ప్రత్యక్షంగా మాట్లాడారు. నిర్మాణ పనుల పురోగతిని అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే, లబ్ధిదారులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఆరా తీశారు. లబ్ధిదారులు స్పందిస్తూ, పనుల నాణ్యత, పురోగతి పట్ల సంతృప్తిగా ఉన్నట్టు తెలియజేశారు. ప్రభుత్వం అందిస్తున్న సహాయం పట్ల కృతజ్ఞతలు తెలిపారు. 

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మదన్ మోహన్ మాట్లాడుతూ, పేదోడు ఇల్లు కట్టి గృహప్రవేశం చేసిన రోజే విజయం సాధించిన వాళ్ళం అవుతామణి అన్నారు. గ్రామాలలో ఇందిరమ్మ కాలనీ లు ఏర్పాటు చేస్తామన్నారు. ఇటీవల గృహ నిర్మాణ శాఖ ఎండీ గౌతమ్ ని కలిసి నియోజకవర్గానికి మరిన్ని ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని కోరినట్లు తెలిపారు. రాష్ట్రంలోనే ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో ఎల్లారెడ్డి నియోజకవర్గాన్ని ప్రథమ స్థానం లో నిలిపెందుకు ప్రతి ఒక్కరు సహకరించాలని కోరారు. 

కల్వరాల్ గ్రామంలో శ్రీ కృష్ణ దేవాలయ సందర్శన

శ్రీ కృష్ణ జన్మాష్టమి సందర్భంగా ఎమ్మెల్యే మదన్ మోహన్  కల్వరాల్ గ్రామంలోని శ్రీ కృష్ణ దేవాలయాన్ని సందర్శించారు. దేవాలయంలో ప్రత్యేక పూజల్లో పాల్గొని భక్తులతో కలసి పండుగను జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో నిర్మించనున్న ఫంక్షన్ హాల్‌కు భూమి పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ ఫంక్షన్ హాల్ నిర్మాణం ద్వారా గ్రామస్థులకు సమూహ కార్యక్రమాలు నిర్వహించేందుకు మంచి వేదికగా నిలుస్తుందని ఎమ్మెల్యే  ఆశాభావం వ్యక్తం చేశారు.