calender_icon.png 16 August, 2025 | 7:26 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పదవ తరగతి విద్యార్థులకు ప్రతిభా పురస్కారం

16-08-2025 05:52:05 PM

నకిరేకల్,(విజయ క్రాంతి): నకిరేకల్ మండలంలోని చందుపట్ల గ్రామంలో జిల్లా పరిషత్ పాఠశాలలో గత సంవత్సరం పదవ తరగతి ఉత్తీర్ణులైన ‌ జ్యోతి, మణికంఠ విద్యార్థులకు ఆగ్రామానికి చెందిన ప్రముఖ సాహితీవేత్త డాక్టర్ పెరంబుదూరు శ్రీరంగాచార్య  వారి తండ్రి రాఘవాచార్యుల పేరు మీద  ‌శనివారం పురస్కారాలు అందించారు.. ప్రథమ స్థానం పొందిన ఈ. జ్యోతికి రూ.10000, ద్వితీయ స్థానం పొందిన కొల్లు మణికంఠకు రూ.5000 ప్రశంసా పత్రం శాలువాతో సన్మానించి అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... గ్రామీణ స్థాయి విద్యార్థులు మట్టిలో మాణిక్యాలని నిరంతరం శ్రమించి ఉన్నత స్థాయికి చేరాలని, లక్ష్యాలు సాధించాలన్నారు.