calender_icon.png 16 August, 2025 | 7:47 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దశ దిన కర్మలో పాల్గొన్న రాష్ట్ర కార్మిక మైనింగ్ శాఖ మంత్రి డాక్టర్ వివేక్ వెంకటస్వామి

16-08-2025 05:48:44 PM

మహదేవపూర్,(విజయక్రాంతి): జయశంకర్ భూపాలపల్లి జిల్లా మలహల్రావు మండలం వల్లెంకుంట గ్రామంలో రాష్ట్ర ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్ అయిత ప్రకాష్ రెడ్డి తల్లి లక్ష్మీబాయి ఇటీవల మృతి చెందింది. శనివారం ఐత లక్ష్మీబాయి దశ దిన కర్మలో రాష్ట్ర కార్మిక మైనింగ్ శాఖ మంత్రి డాక్టర్ వివేక్ వెంకటస్వామి పాల్గొని లక్ష్మీబాయి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి, తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.అనంతరం జిల్లా గ్రంథాలయ  చైర్మన్ కోట రాజ బాబు ఆధ్వర్యంలో పలువురు కాంగ్రెస్ నాయకులు దశ దిన కర్మలో పాల్గొని నివాళులర్పించారు.