calender_icon.png 16 August, 2025 | 7:50 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మలిదశ ఉద్యమకారుడిని పరామర్శించిన మాజీ జెడ్పిటిసి

16-08-2025 05:52:12 PM

కామారెడ్డి (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా(Kamareddy District) రామారెడ్డి మండల కేంద్రంలోని మలిదశ ఉద్యమకారుడు రామస్వామి అనారోగ్యంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న విషయం తెలుసుకొని శనివారం ఆయన కుటుంబాన్ని సదాశివనగర్ ఉమ్మడి మండల మాజీ జెడ్పిటిసి పడిగెల రాజేశ్వరరావు పరామర్శించారు. 2001లో తెలంగాణ కోసం టిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రత్యేక రాష్ట్ర సాధనలో ఉద్యమాన్ని చేపట్టగా మేజర్ గ్రామపంచాయతీ అయినా రామారెడ్డి గ్రామం నుంచి ఉద్యమానికి ఊపిరి అందించిన రామస్వామి నేడు కొనఊపిరితో కొట్టుమిట్టాడుతున్నాడు. ఆయన ఇంటికి వెళ్లి పరామర్శించి కుటుంబానికి ధైర్యం చెప్పారు.

వైద్యానికి అవసరమైన సాయం అందించడానికి టిఆర్ఎస్ పెద్దలను సంప్రదిస్తానని మాజీ జెడ్పిటిసి కుటుంబ సభ్యులకు చెప్పగా వారు తాము అన్ని దావకానాలకు తీసుకెళ్లామని వైద్యం చేయడానికి వైద్యులు అతని శరీరం సహకరిచడం లేదని చెప్పారని తెలిపారు. ఎలాగైనా తమ కుటుంబాన్ని ఆదుకోవాలని కోరారు. మన మాజీ ఎమ్మెల్యే జజాల సురేందర్, కేటీర్, హరీష్ రావు ల ద్రుష్టి కి తీసుకెళ్లి సహాయం అందేవిధంగా కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ సీనియర్ నాయకులు మోషన్ పూర్ దత్తు, గడ్డం రవీందర్ రెడ్డి, గోకుల్ తండా లింబాద్రి నాయక్, కిరణ్ కుమార్ రెడ్డి, జంగం లింగం తదితరులున్నారు.