calender_icon.png 16 August, 2025 | 7:44 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వరద ప్రభావిత ప్రాంతాల్లో అదనపు కలెక్టర్‌ పర్యటన

16-08-2025 05:49:43 PM

మహబూబాబాద్ (విజయక్రాంతి): బంగాళఖాతంలో ఏర్పడ్డ అల్పపీడన ప్రభావంతో మహబూబాబాద్ జిల్లా(Mahabubabad District)లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అధికారులు క్షేత్రస్థాయిలో ఉంటూ, ప్రజలకు ఇబ్బందులకు కలగకుండా ముందస్తుగా అప్రమత్తంగా ఉండాలని జిల్లా అదనపు కలెక్టర్ అనిల్ కుమార్(District Additional Collector Anil Kumar) ఆదేశించారు. జిల్లా అదనపు కలెక్టర్ అనిల్ కుమార్ కొత్తగూడ మండల కేంద్రంలో ఉన్న బుర్కపల్లి వాగు, గుంజేడు వాగు, రేన్య తండా వాగును స్థానిక తహసిల్దార్ కే.రాజుతో కలిసి వాగుల వద్ద వరద ఉధృతిని పరిశీలించారు.

వరద ప్రవాహం ఉద్ధృతిగా ఉన్నందున వాగుల్లోకి చేపల వేట, అలాగే ప్రమాదభరితంగా ఉన్న ప్రాంతాల్లో వాగులు దాటకుండా రాకపోకలను నిలుపుదల చేయాలని అదనపు కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ప్రస్తుతానికి జిల్లా అధికారులు స్థానిక మండల స్థాయి అధికారులను అప్రమత్తం చేయడంతో ప్రాణ, ఆస్తి నష్టాలు సంభవించలేదన్నారు.  ఈ కార్యక్రమంలో కొత్తగూడ ఎమ్మార్వో రాజు, రెవెన్యూ ఇన్స్పెక్టర్ పరమేష్, సీనియర్ అసిస్టెంట్ సాంబయ్య, పంచాయతి కార్యదర్శులు సుమన్ రెడ్డి, శివకాంత్ లు పాల్గొన్నారు.