16-08-2025 04:53:12 PM
పంట నష్టంపై విచారణ జరపాల్సిందిగా కలెక్టర్ ను కోరిన ఎమ్మెల్యే
మద్నూర్(విజయక్రాంతి): మద్నూర్ మండలం చిన్న ఎక్లార గ్రామాన్ని బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి సందర్శించారు. గ్రామంలోకి వరద నీరు రావడంతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారని సమాచారం తెలుసుకున్న సబ్ కలెక్టర్ వెంటనే మండల స్థాయి అధికారులతో కలిసి గ్రామానికి వెళ్లారు. కాలువలో చెత్తతో పాటు ముళ్ళపొదలు అడ్డుగా ఉండడంతో నీటి ప్రభావం ఉధృతికి గ్రామంలోకి నీళ్లు వచ్చాయని అధికారులు వివరించారు.
వెంటనే జెసిబి సహాయంతో మురికి కాలువను శుభ్రం చేసి నీటి ప్రభావం బయటికి వెళ్లేలా అధికారులు చర్యలు తీసుకున్నారు. గ్రామ శివారులో భారీగా పంటలు నీట మునిగాయని రైతులు చెప్పారు. చిన్న ఎక్లారా గ్రామంలో రైతుల పంట పొలాలు నీట మునిగి తీవ్ర పంట నష్టం వాటిల్లింది. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు, హైదరాబాద్ వెళ్తుండగా మార్గమధ్యంలో జిల్లా కలెక్టర్ కు ఫోన్ చేసి పరిస్థితిని వివరించారు.పంట నష్టంపై విచారణ జరిపి ప్రభుత్వానికి నివేదిక పంపాలని కలెక్టర్ ను కోరారు.