బీజేపీ ఆధ్వర్యంలో స్వాతంత్య్ర వేడుకలు
వేములవాడ, ఆగస్ట్ 15, (విజయ క్రాంతి): వేములవాడ పట్టణ బీజేపీ ఆధ్వర్యంలో 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడు కలు శనివారం ఘనంగా నిర్వహించారు. పట్టణ అధ్యక్షుడు రాపల్లి శ్రీధర్ ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ప్రతాప రామకృష్ణ ఆధ్వర్యంలో ఆయన రిసార్ట్‌లో జాతీ య భావాన్ని పెంపొందించేలా 80 జాతీయ జెండాలను ఏకకాలంలో ఆవిష్కరించారు.ఈ సందర్భంగా రాపల్లి శ్రీధర్ మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు గత మూడు రోజులుగా ‘హర్ ఘర్ తిరంగా’ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వేములవాడకు ఆధ్యాత్మిక, సనాతన ధర్మ క్షేత్రంగా ప్రత్యేక గుర్తింపు ఉందని, అదే సమయంలో జాతీయ భావాన్ని పెంపొందించా ల్సిన అవసరం ఉందన్నారు.
80 జెండాల ఆవిష్కరణలో కార్యకర్తలు, పుర ప్రముఖులను భాగస్వాములను చేసి ప్రతి ఒక్కరితో జెండా ఆవిష్కరింపజేసిన ప్రతాప రామకృష్ణకు కృతజ్ఞతలు తెలిపారు. పట్టణ ప్రజలకు స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.ప్రతాప రామకృష్ణ మాట్లాడుతూ దేశం ప్రతి ఒక్కరిదని, గతంలో జాతీయ జెండా ఎగురవేయడంపై అనేక ఆంక్షలు ఉం డేవని అన్నారు. నరేంద్ర మోదీ నాయకత్వం లో ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురవేసే అవకాశం లభించిందన్నారు.
దేశ రక్షణ, అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ ప్రధాని మోదీకి మద్దతుగా నిలవాలని కోరారు.కార్యక్రమం లో సీనియర్ వైద్యులు డాక్టర్ మనోహర్, డాక్టర్ రాధాకృష్ణ, రాష్ట్ర బీజేపీ నాయకులు, కౌన్సిలర్ కుమ్మరి శంకర్, రాష్ట్ర ఎస్సీ మోర్చా కార్యదర్శి సంటి మహేష్, రేగుల రాజ్కుమార్, కౌన్సిలర్లు వంగల శ్రీనివాస్, కొండేపు ముత్యం, మైలారం శ్రీనివాస్ తదితర నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.






