భారీ తిరంగా బైక్ ర్యాలీ
- భగత్‌సింగ్ యువసేన అధ్యక్షుడు ఆధ్వర్యంలో నిర్వహణ
- పాల్గొన్న ప్రముఖ నటుడు సోను సూద్
హైదరాబాద్, ఆగస్టు 15(విజయక్రాంతి): భగత్ సింగ్ యువసేన రాష్ట్ర అధ్యక్షుడు లడ్డు యాదవ్ ఆధ్వర్యంలో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని బేగంబజార్ ఛత్రి వద్ద లడ్డు యాదవ్, పవన్ సింగ్, అజయ్ అగర్వాల్, రోమల్ సింగ్, దినేష్ యాదవ్, గురుసిందిల ఆధ్వర్యంలో శనివారం భారీ తిరంగా బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీకి ప్రముఖ సినీనటుడు సోను సూద్ ముఖ్య అతిధిగా హాజరై ప్రసంగించారు. బేగంబజార్ తో నాకు ఎంతో అభిమాన సంబంధం ఉందన్నారు.
ఇక్కడ ఉన్న కొన్ని ప్రాంతాల్లో యువత మత్తుకు పదార్ధాలకు బానిసలు అవుతున్నారని, వారందరిని మత్తు పదార్ధాలకు దూరంగా ఉండేలా మనమందరం చైతన్యంతో వారిని ఆదుకుందా మన్నారు. అవసరమైన వారికి తన వంతు ఆర్థిక సాయం చేసానన్నారు.
లడ్డు యాదవ్ ఆధ్వర్యంలో దేశభక్తితో భారీ తిరంగా ర్యాలీ నిర్వహించడం, ఈ ర్యాలీకి వేలాదిమంది తరలిరావడం తనకేంతో ఆనందం కలిగించిందన్నారు. పలువురు దివ్యాంగులకు వీల్ చైర్లు, అనాధ విద్యార్థులకు స్కూల్ బ్యాగులు పంపిణీ చేశారు. దీర్ఘ కాలిక వ్యాధితో బాధపడుతున్న ఓ చిన్నారికి సోనూసూద్ ఆర్థికంగా సహాయం అందించారు.






