నూతన ఆవిష్కరణలతోనే వికసిత్ భారత్
- విజ్ఞాన్స్ యూనివర్సిటీ డైరెక్టర్ ప్రొఫెసర్ వైవీ దాసేశ్వర రావు
- బాధ్యతగల పౌరులుగా ఎదిగినప్పుడే స్వాతంత్య్రానికి సార్థకత
- అడ్వైజర్, రిటైర్డ్ ఐఏఎస్ డాక్టర్ పూనం మాలకొండయ్య
- ఘనంగా 80వ స్వాతంత్య్ర వేడుకలు
హైదరాబాద్, ఆగస్టు 15(విజయక్రాంతి): సాంకేతిక పరిజ్ఞానాన్ని కేవలం ఉద్యోగాల సాధనకే పరిమితం చేయకుండా, సమాజంలోని సమస్యలను పరిష్కరించే నూతన ఆవి ష్కరణల వైపు మళ్లించినప్పుడే ‘వికసిత్ భారత్ 2047’ కల సాకారమవుతుందని విజ్ఞాన్స్ యూనివర్సిటీ డైరెక్టర్ ప్రొఫెసర్ వై వీ దాసేశ్వరరావు అన్నారు. యాదాద్రి భు వనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మండలం దేశ్‌ముఖిలోని విజ్ఞాన్స్ యూనివర్సిటీలో స్టూడెంట్ అఫైర్స్ విభాగం ఆధ్వర్యంలో 80 వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు శనివారం అత్యంత వైభవంగా, ఉత్సాహపూ రిత వాతావరణంలో జరిగాయి.విజ్ఞాన్ కళాతోరణం వేదికగా డైరెక్టర్ ప్రొఫెసర్ వైవీ దా సేశ్వర రావు మువ్వన్నెల జెండాను ఆవిష్కరిం చారు.
అనంతరం విద్యార్థులను ఉద్దే శిం చి డైరెక్టర్ ప్రసంగిస్తూ వికసిత్ భారత్ లక్ష్యాన్ని చేరుకోవడంలో విద్యార్థుల పాత్ర కీలకమైనదని, అందుకోసం డిజైన్, డీబగ్, డిప్లాయ్ అనే 3డీ సాంకేతిక నైపుణ్యాలను పెంపొందించుకోవాలని సూచించారు. యూనివర్సి టీ అడ్వైజర్, రిటైర్డ్ ఐఏఎస్ డాక్టర్ పూనం మాలకొండయ్య మాట్లాడుతూహక్కుల కోసం పోరాడే ప్రతి ఒక్కరూ తమ పౌర బా ధ్యతలను కూడా గుర్తుంచుకోవాలని, ప్రతి పౌరుడూ బాధ్యతాయుతంగా ప్రవర్తించినప్పుడే దేశ స్వాతంత్య్రానికి నిజమైన సార్థకత లభిస్తుందని పేర్కొన్నారు.
కాగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా సందర్భంగా నిర్వహించిన భారీ తిరంగా ర్యాలీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. వివిధ క్రీడా, వ్యాసరచన, సాంకేతిక పోటీల విజేతలకు అతిథుల చేతుల మీదుగా బహుమతులు, ప్రశంసా ప త్రాలు అందజేశారు. ఈ వేడుకల్లో విజ్ఞాన్స్ యూనివర్సిటీ డైరెక్టర్ ప్రొఫెసర్ వైవీ దాసేశ్వరరావు, అడ్వైజర్ డాక్టర్ పూనం మాలకొ ండయ్యలతో పాటు వివిధ విభాగాల డీన్లు, డైరెక్టర్లు, విభాగాధిపతులు, అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.






