16 August, 2026 | 2:30 AM

కేర్, ఆస్టర్ ఆసుపత్రుల్లో స్వాతంత్య్ర వేడుకలు

16-08-2026 12:00 AM

స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలను స్మరించుకున్న పలువురు

హైదరాబాద్, ఆగస్టు 15(విజయక్రాంతి): కేర్, ఆస్టర్ హాస్పిటల్స్ 80వ స్వాతంత్య్ర ది నోత్సవ వేడుకలు శనివారం ఘనంగా నిర్వ హించారు. వైద్యులు, నర్సులు, సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొని స్వాతంత్య్ర సమర యోధుల త్యాగాలను స్మరించుకున్నారు. బంజారాహిల్స్‌లోని కేర్ హాస్పిటల్స్‌లో ఆస్ట ర్ డీఎం క్వాలిటీ కేర్ లిమిటెడ్ సీఈఓ ఇండి యా II డాక్టర్ పవన్ కుమార్ జాతీయ పతా కాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జోనల్ సీఓఓ అభినవ్ జోషి, మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ అజిత్ సింగ్, సీని యర్ వైద్యులు డాక్టర్ పీసీ గుప్తా, డాక్టర్ వి. సూర్య ప్రకాష్‌తో పాటు నర్సింగ్, సెక్యూ రిటీ విభాగాల సిబ్బంది, ఇతర ఉద్యోగులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా డాక్టర్ పవన్ కుమార్ మాట్లాడుతూ.. స్వాతంత్య్రం కోసం మహనీయులు చేసిన త్యాగాలను స్మరిం చుకోవడంతో పాటు దేశ భవిష్యత్తు పట్ల మన బాధ్యతను గుర్తుచేసుకునే రోజు ఇది. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి భారత్ అన్ని రంగాల్లో అద్భుతమైన అభివృద్ధి, పరి వర్తన సాధించింది. వికసిత్ భారత్2047 ల క్ష్య సాధనకు బాధ్యతగల పౌరులుగా స్పష్ట మైన దృక్పథంతో ప్రతి ఒక్కరూ తమ వం తు కృషి చేయాలి. సరిహద్దుల్లో సైనికులు దేశాన్ని కాపాడుతుంటే.. వైద్యులు, వైద్య సిబ్బంది ప్రజల ఆరోగ్యాన్ని, ప్రాణాలను కాపాడుతున్నారు. ఇద్దరూ అంకితభావంతో దేశానికి సేవ చేస్తున్నారు అని పేర్కొన్నారు.