calender_icon.png 15 August, 2025 | 7:35 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png
Breaking News

వాడవాడలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు

15-08-2025 06:12:19 PM

రాజాపూర్: మండల ప్రజలు శుక్రవారం భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రంలో తసీల్దార్ కార్యాలయం, మండల పరిషత్తు, పోలీసు స్టేషన్  తదితర ప్రభుత్వ కార్యాలయాలు, విద్య సంస్థలు, అంగన్ వాడి కేంద్రాల్లో యువజన సంఘాలు, పలు పార్టీల కార్యాలయాల్లో జాతీయ జెండాను ఆవిష్కరించారు. మండలంలోని ఆయా గ్రామాల్లో ప్రభుత్వ పాఠశాలలు,గ్రామపంచాయతీ భవనాలు  అధికారులు మువ్వన్నెల జెండాలను ఆవిష్కరించారు.