17-12-2025 12:00:00 AM
ప్రతి ఒక్కరికి అండగా ఉంటాం : ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి
జడ్చర్ల, డిసెంబర్ 16: జడ్చర్ల నియోజకవర్గంలో ఇండిపెండెంట్ (స్వతంత్య్ర) అభ్య ర్థులుగా బరిలో నిలబడి సర్పంచ్ లుగా, వార్డు మెంబర్లుగా గెలుపొందిన వారు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ లోకి క్యూ కడుతున్నారని, ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి అన్నారు. ఈ నేపథ్యంలోనే మంగళవారం రాజాపూర్, నవాబుపేట, మిడ్జిల్ మండలాలకు చెందిన పలువురు సర్పంచ్ లు, వార్డు మెంబర్లు కాంగ్రెస్ పార్టీలోకి చేరగా అనిరుధ్ రెడ్డి వారికి కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు.
రాజాపూర్ మండలంలోని చెన్నవెల్లి, కల్లేపల్లి, నవాబుపేట మండలంలోని లింబ్యా తాండ, కొల్లగుట్ట తాండ, మిడ్జిల్ మండలంలోని వెలుగొమ్ముల గ్రామాల నుంచి ఈ చేరికలు భారీగా జరిగాయి. రాజాపూర్ మండలంలోని చెన్నవెల్లి గ్రామానికి చెందిన సర్పంచ్ పానుగంటి యాదగిరి, డిప్యుటీ సర్పంచ్ భార్గవి శేఖర్ రెడ్డి, వార్డు సభ్యులు పానుగంటి శంకర్ స్వామి, పిట్టెల శివకుమార్, రాయగడ మణెమ్మ, తిరుపతి రెడ్డి, కే.రమ్యా రెడ్డి, ఆర్.శేఖర్ రెడ్డి, శివలీల ఎమ్మెల్యే సమక్షంలో కాంగ్రెస్ పార్టీలోకి చేరారు.
అలాగే కల్లేపల్లి సర్పంచ్ కాట్రావత్ చందర్, ఉప సర్పంచ్ కుమ్మరి శేఖర్, వార్డు సభ్యులు కాట్రావత్ సుశీలా జానీసింగ్, సీహెచ్ చిన్న, జటావత్ తిరుపతి, కావలి రోజా, నేనావత్ మాధవి, పలుగుగుట్ట తాం డా సర్పంచ్ శంకర్ బాబు, కూడా కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. అలాగే నవాబుపేట మండలంలోని వెంకటేశ్వర తాండ సర్పంచ్ లింబ్య నాయక్, కొల్లగుట్ట తాండ ఉప సర్పంచ్ రవి అనిరుద్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.
తమ గ్రామాల సమస్యలను వారు ఎమ్మెల్యేకు వివరించి వాటిని పరిష్కరించడానికి కావాల్సిన నిధులను మంజూరు చేయాల్సిందిగా ఎమ్మెల్యే కు విజప్తి చేయడంతో వెంకటేశ్వర తాండ అభివృద్ధికి రూ.25 లక్షలు, కొల్లగుట్ట తాండ అభివృద్ధి కి రూ.20 లక్షలు చొప్పున మంజూరు చేస్తామని అనిరుధ్ రెడ్డి వారికి హామీ ఇచ్చారు.
మిడ్జిల్ మండలం వెలుగొమ్ముల గ్రామ సర్పంచ్ సువర్ణ గోవర్ధన్ రెడ్డి , మంగళగడ్డ తాండా సర్పంచ్ చందు నాయక్, ఉప సర్పంచ్ జటావత్ శీను నాయక్ కూడా ఈరోజు ఎమ్మెల్యే ఆధ్వర్యంలో పార్టీలోకి చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొత్తగాపార్టీలోకి చేరుతున్న సర్పంచ్ లు, వార్డు మెంబర్లకు పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. ఈ కార్యక్రమాల్లో ఆయా మండలాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ ముఖ్యనాయకులు హాజరయ్యారు.