17-12-2025 12:00:00 AM
కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన మంత్రి శ్రీధర్ బాబు
మంథని, డిసెంబర్16(విజయ క్రాంతి): మంథని మండలం కాకర్లపల్లి గ్రామానికి చెందిన బీఆర్‌ఎస్ గ్రామశాఖ అధ్యక్షులు మాజీ సర్పంచ్ ఆకుల శ్రీనివాస్ తో పాటు టిఆర్‌ఎస్వి నియోజకవర్గ సెక్రెటరీ ఆకుల సాయికుమార్ మంగళవారం హైదరాబాద్ బంజారాహిల్స్ లోని మినిస్టర్ క్వార్టర్స్ లో రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి దుద్ధిళ్ల శ్రీధర్ బాబు సమక్షంలో కాంగ్రెస్ పార్టీ లో చేరారు. ఈ సందర్బంగా మంత్రి శ్రీధర్ బా బు మాజీ సర్పంచ్ శ్రీనివాస్ కు కాంగ్రెస్ కండువా కప్పి పార్టీ లోకి ఆహ్వానించారు.
మొదటి విడత పంచాయితీ ఎన్నికల్లో నూతనంగా ఎన్నికైన కాకర్లపల్లి గ్రామానికి ఉప సర్పంచ్, వార్డ్ మెంబెర్ ల్లు మంత్రిని కలిశారు. ఈ సందర్బంగా మంత్రి శ్రీధర్ బాబు వారికీ శుభాకాంక్షలు తెలియజేశారు. ఎన్నకైనా వార్డ్ మెంబెర్లు మంత్రిని శాలువాతో సత్కరించారు.
గ్రామ అభివృద్ధి కొరకు కృషి చేయాలనీ నూతనంగా ఎన్నికైనా వార్డ్ మెం బెర్లకు మంత్రి సూచించారు. ఈ కార్యక్రమం లో మార్కెట్ కమిటీ డైరెక్టర్ కనెవేన ఓదెలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు మెండే రాజయ్య, కనవెన కుమారస్వామి యాదవ్, వార్డ్ మెం బర్లు మేదరవేన పద్మ రాము, కలకుర్తి మౌ నిక, మహేష్, సేనం సంతోష్, రామగళ్ళ రవి తదితరులు పాల్గొన్నారు.