17-12-2025 12:00:00 AM
సర్పంచ్ నాగరాజుకు సన్మానంలో మంత్రి శ్రీధర్ బాబు
మంథని డిసెంబర్ 16(విజయ క్రాంతి): మంథని మండలంలోని సూరయ్యపల్లి గ్రామ అభివృద్ధికి పాటుపడాలని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు నూతనం గా ఎన్నికైన సర్పంచ్ ఆర్ల నాగరాజు కు స న్మానం లో సూచించారు. మంగళవారం హైదరాబాద్ మినిస్టర్ క్వార్టర్స్ లో రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు ను మర్యాదపూర్వకం గా సర్పంచ్ తో పాటు కాంగ్రెస్ నాయకులు కలిశారు.
ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన గ్రామ సర్పంచ్ అర్ల నాగరాజు, ఉప స ర్పంచ్ తో పాటు వార్డు సభ్యులు, గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులను, కార్యకర్తలను మంత్రి అభినందించారు. గ్రామ అభివృద్ధికి అందరూ కృషి చేయాలని మంత్రి కోరారు. ఈ కార్యక్రమంలో మంథని సీనియర్ అడ్వకేట్ చందుపట్ల రమణ కుమార్ రెడ్డి, మాజీ సర్పంచ్ ఆకుల కిరణ్ తో పాటు కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ఇంచార్జీ ఆరేళ్లి కిరణ్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.