calender_icon.png 10 October, 2025 | 3:34 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సుసంపన్నమైన దేశంగా భారత్

10-10-2025 01:04:16 AM

* ఘనంగా ఆర్‌ఎస్‌ఎస్ ఉత్సవాలు

* ముఖ్య వక్తగా అప్పల ప్రసాదు హాజరు

జహీరాబాద్, అక్టోబరు 9 :దేశానికి స్వాతంత్రం వచ్చి 100 సంవత్సరాల నాటికి దేశం సుసంపన్న దేశంగా నెలకొంటుందని తెలంగాణ ప్రాంత సామాజిక సమరసత సంయోజక్ అప్పల ప్రసాదు అన్నారు. జహీరాబాద్ నియోజకవర్గంలోని శ్రీ దత్తగిరి మహారాజ్ ఆశ్రమం బర్దిపూర్ లో రాష్ట్రీయ స్వయం సేవక సంఘ శతజయంతి ఉత్సవాల సందర్భంగా ముఖ్య వక్తగా పాల్గొని ఆయన ప్రసంగించారు. బర్దిపూర్ గ్రామంలో దాదాపు 300 మంది స్వయం సేవకులతో పద సంచలన నిర్వహించారు.

గ్రామ పురవీధుల గుండా స్వయం సేవకులు పద సంచలన నిర్వహిస్తుంటే ప్రజలు తమ ఇళ్లపై నుంచి పూల వర్షం కురిపించారు. అనంతరం దత్తగిరి ఆశ్రమంలో సమావేశం నిర్వహించారు. దత్తగిరి ఆశ్రమ పీఠాధిపతి వైరాగ్య శిఖామణి అవధూత గిరి మహారాజ్, మహా మండలేశ్వర్ డాక్టర్ సిద్దేశ్వర నందగిరి మహారాజ్ పాల్గొన్నారు. అప్పల ప్రసాద్ మాట్లాడుతూ ఎందరో దేశంపై దండయాత్రలు చేసి ఇక్కడే ఉన్న సంపదను దోచుకొని పోయారన్నారు.

మొగలులు, ఆంగ్లేయులు దేశంలో ఉన్న సంపదను దోచుకోవడం వల్ల దేశం పేద దేశంగా మారిందని, స్వాతంత్రం వచ్చి 100 సంవత్సరాలు పూర్తి చేసుకునే నాటికి భారతదేశం గత వైభవాన్ని సంతరించుకుంటుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో బర్దిపూర్, కుప్పా నగర్, న్యాల్కల్, మచునూర్, ఝరాసంగం, కొల్లూరు, గ్రామాల స్వయం సేవకులు పాల్గొన్నారు.