calender_icon.png 10 October, 2025 | 8:26 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాంగ్రెస్ పార్టీ నాయకుల తీరు నచ్చక బీఆర్‌ఎస్‌లో చేరిక

10-10-2025 01:02:38 AM

- హైడ్రా పేరుతో పేద ప్రజలను రోడ్డున పడేసింది

- మాజీ ఎంపీపీ అనంతుల పద్మ నరేందర్

కొండపాక, అక్టోబర్ 9:కొండపాక మండలంలోని మాజీ ఎంపీపీ అనంతుల పద్మ నరేందర్, కోడెల ఐలయ్య, రాంపల్లి మల్లేశం లతో సహా వంద మంది కాంగ్రెస్ నాయకులు బిఆర్‌ఎస్ లో చేరామన్నారు. తెలంగాణ భవన్ లో మాజీ మంత్రి హరీష్ రావు, బూరుగుపల్లి ప్రతాపరెడ్డి ఆధ్వర్యంలో గురువారం కొండపాక మండల మాజీ ఎంపీపీ అనంతుల పద్మ నరేందర్, కోడెల ఐలయ్య, రాంపల్లి మల్లేశం లతో సహా వంద మంది కాంగ్రెస్ పార్టీ నాయకులు బిఆర్‌ఎస్ పార్టీలో చేరామన్నారు.

కాంగ్రెస్ పార్టీ ఎన్నికలలో ఇచ్చిన హామీలను అమలు చేయలేదు, రైతులకు యూరియా అందించలేదు, ఆడపిల్లల పెళ్లిలకు తులం బంగారం, వృద్ధులకు నాలుగు వేల పింఛను అమలు చేయలేదన్నారు. హైడ్రా పేరుతో పేద ప్రజల ఇండ్లను కూలగొట్టి రోడ్డున పడేసింది కాంగ్రెస్ పార్టీఅని అన్నారు.

కాంగ్రెస్ పార్టీలో కొందరు నాయకుల తీరు నచ్చక మేము బి.ఆర్.ఎస్ పార్టీలో చేరుతున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ గ్రంథాలయ చైర్మన్ లక్కిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, అనంతుల ప్రశాంత్, మాజీ బిఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు దుర్గయ్య, జైపాల్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, బొద్దుల తిరుపతి, రాములు గౌడ్, భానుచందర్ గౌడ్, దుర్గాప్రసాద్ దుర్గప్రసాద్,స్వామి, రాము, హరీష్, తదితరులుపాల్గొన్నారు.