06-09-2025 12:59:10 AM
బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రాంచందర్ రావు
ముషీరాబాద్, సెప్టెంబర్ 5 (విజయక్రాంతి): గురువులను గౌరవించే సంప్రదా యం కేవలం భారతదేశంలోనే ఉందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్ రామచందర్ రావు అన్నారు. టీచర్స్ డేను పురస్కరించుకుని రామాలయం ఫౌండేషన్, మాతృదే వోభవ సత్‌సంగ్ ఆధ్వర్యంలో శుక్రవారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్‌లో పలువురు ఉత్తమ ఉపాధ్యాయులను శాలువాతో సత్కరించి జ్ఞాపికలను అందజేశారు.
ఈ సందర్భంగా ఎన్. రామచందర్ రావు మాట్లాడుతూ కొంతమంది రాజకీయ నాయకులు అ మ్మను కూడా తిట్టే పరిస్థితి నెలకొందన్నారు. ఓయూలోని అధ్యాపకులకు ఒకటో తారీఖు వరకు జీతాలు అందిం చడం లేదంటే అధ్యాపకులపై గౌరవం ఏముందని ప్రశ్నించారు. కాంట్రాక్టు పద్ధతిలో టీచర్స్‌ను తీసుకోవడం సరైంది కాదన్నారు. కాంట్రాక్టు టీచర్స్ విధానాన్ని వెం టనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో బీసీ కమిషన్ మాజీ చైర్మన్ వకుళాభరణం కృష్ణమోహన్, మా తృదేవోభవ ఫౌండేషన్ చైర్మన్ శ్రీధర్, ఫాబో సర్వీసెస్ కో-ఫౌండర్ సోమ దివాకర్ల, జి. నరేందర్ రెడ్డి, సూర్యప్రకాష్, కోటేశ్వరరావు, కొండల్ రావు, శివశంకర్, రామాను జం, చంద్రశేఖర్, బాలకృష్ణ, డాక్టర్ దిలీప్, శ్రీధర్ తదితరులు పాల్గొనగా అక్షర దేవ రాజన్ చేసిన భరతనాట్య నృత్యం అందరినీ ఆకట్టుకుంది.