calender_icon.png 6 July, 2025 | 10:31 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రజాస్వామ్య సంతృప్తిలో భారత్‌కు రెండో స్థానం

06-07-2025 01:29:18 AM

- డెమొక్రసీపై 74 శాతం భారతీయులు సంతోషం

- ప్యూ రీసెర్చీ సెంటర్ నివేదికలో వెల్లడి

న్యూఢిల్లీ, జూలై 5: ప్రజాస్వామ్య విధా నం పట్ల అత్యధిక స్థాయిలో సంతృప్తికరంగా ఉన్న దేశాల్లో భారత్ రెండో ర్యాంకు సాధించింది. తమ దేశ ప్రజాస్వామ్యం పట్ల 74 శాతం మంది భారతీయులు సంతోషంగా ఉన్నట్లు ప్యూ రీసెర్చ్ సెంటర్ నివేదికలో వెల్లడైంది. 75 శాతంతో స్వీడన్ తొలి స్థానంలో ఉంది.

2025లో 23 దేశాల్లో నిర్వహించిన సర్వేలో జపాన్‌లో 24 శాతం మంది మాత్ర మే ప్రజాస్వామ్యంపై సంతృప్తిగా ఉన్నట్టు తేలింది. కెనడా, ఫ్రాన్స్, ఇటలీ, జర్మనీ, గ్రీస్, జపాన్, నెదర్లాండ్స్, దక్షిణ కొరియా, స్పెయిన్, యూకే, యూఎస్‌లో సగటున 64 శాతం మంది తమ ప్రజాస్వామ్యం పట్ల అసంతృప్తిగా ఉన్నారు.

ఇక గ్రీస్ 81 శాతం, జపాన్ 76 శాతం, దక్షిణ కొరియా 71 శాతంతో ప్రజాస్వామ్యం పట్ల అత్యధిక స్థాయిలో అసంతృప్తి ఉన్న దేశాలుగా నిలిచాయి. సర్వే చేయబడిన 23 దేశాల్లో సగటున 58 శాతం మంది మాత్ర మే ప్రజాస్వామ్య విధానం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఎనిమిదేళ్ల నుంచి ఈ సర్వే నిర్వహిస్తుండగా ప్రజాస్వామ్యం పనితీరుపై సంతృప్తి తగ్గుతోందని నివేదిక వెల్లడించింది.