06-07-2025 01:29:33 AM
పూంచ్ సురాన్ కోట్‌లో భద్రతా దళాల సెర్చ్ ఆపరేషన్
పూంచ్, జూలై 5: పూంచ్ సురాన్‌కోట్ తహసీల్ దార్ ప్రాంతంలో పోలీసులు, సైన్యం సంయుక్తంగా సెర్చ్ ఆపరేషన్ నిర్వహించాయి. ఈ సందర్భంగా ఉగ్రవాదుల రహస్య స్థావరా న్ని గుర్తించి ధ్వంసం చేశారు. ఈ ఆపరేషన్‌లో భద్రతా దళాలు పెద్ద మొత్తం లో ఆయుధాలు, మందుగుండు సామగ్రిని బలగాలు స్వాధీనం చేసుకున్నాయి.
ఈ రహస్య స్థావరం నుంచి మూడు హ్యాండ్ గ్రెనేడ్‌లు, బుల్లెట్లు, ఛార్జ్ లీడ్, ఇనుప రాడ్, వైర్ కట్టర్, కత్తి, పెన్సిల్ సెల్, లైటర్ సహా పలు సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్టు తెలిపాయి. ఇదిలా ఉంటే ఉగ్రవాదులు, భద్రతా దళాలకు మధ్య ఇటీవల ఉధంపూర్‌లో ఎన్‌కౌంటర్ జరిగిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో బంసత్‌గఢ్‌లో పారిపోయిన ఉగ్రవాదుల కోసం పోలీసులు, బలగాలు సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నాయి.