calender_icon.png 6 July, 2025 | 11:17 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

‘వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్లు’పై ట్రంప్ సంతకం

06-07-2025 01:27:49 AM

-చట్టంగా మారిన పన్నుల్లో కోత, వ్యయ నియంత్రణల బిల్లు

వాషింగ్టన్, జూలై 5: అమెరికా ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన ‘వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్లు’పై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంతకం చేశారు. దీంతో ఈ బిల్లు చట్ట రూపం దాల్చింది. రిపబ్లికన్ సభ్యులు, అధికారుల హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్న వేళ ఈ బిల్లుపై ఆయన సంతకం చేశారు.

ఈ సందర్భంగా ట్రంప్ మాట్లాడుతూ ప్రజలెప్పుడూ ఇంత సంతోషంగా ఉన్నట్టు గతం లో తానెప్పుడూ చూడలేదన్నారు. ఈ చట్టం తో అందరికీ లబ్ధి జరుగుతుందన్నారు. సాయుధ బలగాల నుంచి రోజూవారి కార్మికుల వరకు కొత్త చట్టం మద్దతుగా ఉంటుం దన్నారు. స్పీకర్ మైక్ జాన్సన్‌కు, సెనెట్ మెజారిటీ లీడర్ జాన్ థునెకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

కాగా పన్నుల్లో కోత, వ్యయ నియంత్రణల కోసం ట్రంప్ ఈ బిల్లును తీసుకొచ్చారు. ఇటీవలే బిగ్ బ్యూటిఫుల్ బిల్లుపై సెనెట్‌లో సుదీర్ఘ చర్చ సాగింది. ముగ్గురు రిపబ్లికన్‌లు వ్యతిరేకంగా ఓటు వేసినప్పటికీ 51 తేడాతో అక్కడ ఆమో దం లభించింది. ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ టై బ్రేకర్‌గా మారి బిల్లును గట్టెక్కించారు. అనంత రం ప్రతినిధుల సభలో బిల్లుకు అనుకూలం గా 218, వ్యతిరేకంగా 214 ఓట్లు వచ్చాయి.