03-08-2025 12:34:51 AM
వారణాసి, ఆగస్టు 2: ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించేందుకు భారత్ అతిదగ్గరలో ఉందని ప్రధా ని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. శనివారం వారణాసిలో పర్యటించిన మోదీ అక్కడ నిర్వహించిన బహిరంగ ర్యాలీలో మాట్లాడారు. కొద్ది రోజుల క్రితం అమెరికా ప్రధాని ‘డెడ్ ఎకానమీ’ అంటూ చేసిన వ్యాఖ్యలకు మోదీ కౌంటర్ ఇచ్చారు. స్వదేశీ ఉత్పత్తుల వాడకం పెంచాలంటూ కూడా మోదీ పిలుపునిచ్చారు.
‘ప్రపంచవ్యాప్తంగా అనిశ్చితి నెలకొంది. దేశాలన్నీ తమ సొంత ప్రయోజనాలపై దృష్టి పెడుతున్నాయి. ఈ సమ యంలో మనం ఆర్థిక ప్రయోజనాలపై మరింత అప్రమత్తంగా ఉండాలి. దేశ ప్రజల ప్రయోజనాల కోసం కేంద్రం అన్ని చర్యలు తీసుకుంటోంది. భారత్ త్వరలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారబోతుంది. రాజకీయ పార్టీలు కూడా విభేదాలు పక్కనపెట్టి.. స్వదేశీ ఉత్పత్తుల ఉద్యమంలో కలిసి రావాలి.
కేవలం భారతీయులు తయారు చేసిన వస్తువులను మాత్రమే కొనాలి’ అని మోదీ పిలుపునిచ్చారు. ఈ పర్యటనలో ప్రధాని మోదీ రూ. 2,200 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. కరదామేశ్వర్ మహదేవ్ ఆలయ నిర్మాణం, కర్కియాన్‌లో అభి వృద్ధి పనులను ప్రారంభించారు. రష్యాతో వ్యాపారం చేస్తున్నామనే కారణంతో భారత్‌పై 25 శాతం అదనపు సుంకాలు విధిస్తూ.. రష్యా, భారత్ ‘డెడ్ ఎకానమీ’లు అని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన వ్యాఖ్యలకు మోదీ కౌంటర్ ఇచ్చారు.
పాకిస్థాన్‌కూ హెచ్చరికలు..
వారణాసి ర్యాలీలో మోదీ పాకిస్థాన్‌కు కూడా హెచ్చరికలు జారీ చేశారు. పాక్ ఉగ్రమూకలను సహించే ప్రసక్తే లేదన్నారు. ఉగ్రమూకలు పాతాళంలో ఉన్నా వదిలిపెట్టబోమని హెచ్చరించారు. ‘ఆపరేషన్ సిందూర్ సమయంలో ప్రపంచం మొత్తం భారత ఉగ్రరూపాన్ని చూసింది.
భారత్‌కు నష్టం చేసి పాతాళలోకంలో దాక్కున్నా సరే భారత్ వారిని వదిలిపెట్టదని ఈ ఆపరేషన్‌తో నిరూపితం అయింది’ అని మోదీ పేర్కొన్నారు. ఆపరేషన్ సిందూర్‌పై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలను కూడా ఖండించారు. పాక్‌లోని ఉగ్రస్థావరాలు ధ్వంసం అయితే కాంగ్రెస్ జీర్ణించుకోలేకపోతుందని దుయ్యబట్టారు.
‘కిసాన్ సమ్మాన్ నిధి’ నిధులు విడుదల
ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి కింద ప్రధాని మోదీ 20వ విడుత నిధులను విడుదల చేశారు. రూ. 20,500 కోట్లను దేశవ్యాప్తంగా ఉన్న 9 కోట్ల 70 లక్షల రైతుల ఖాతాల్లోకి బదిలీ చేశారు. ‘ప్రభుత్వానికి రైతాం గం పట్ల ఎంత చిత్తశుద్ధి ఉందో కిసాన్ సమ్మాన్ నిధి ఉదాహరణ. గత దశాబ్దకాలంగా దేశంలోని అన్నదాతలకు ఎదురయ్యే ప్రతి సమస్యను మా ప్ర భుత్వం త్వరితగతిన పరిష్కరిస్తుంది. ప్రతిపక్షాల తప్పుడు ప్రచారాలను న మ్మొద్దు’ అని తెలిపారు.