03-08-2025 12:33:08 AM
బెంగళూరు, ఆగస్టు 2: లైంగిక దాడి కేసు లో జనతాదళ్ సెక్యులర్ (జేడీఎస్) మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణకు బెంగళూరులోని ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టు జీవిత ఖైదు విధించింది. దీంతో పాటు 10 లక్షల జరిమానా విధించిన న్యాయస్థానం.. బాధి తురాలికి రూ. 7 లక్షల పరిహారం ఇవ్వాలని ఆదేశించింది. కేసులో 26 మంది సాక్షులను విచారించిన న్యాయమూర్తి సంతోష్ గజానన శుక్రవారం రేవణ్ణను దోషిగా తేల్చిన విషయం తెలిసిందే.
తాజాగా శనివారం జీవితఖైదు విధిస్తూ ప్రత్యేక కోర్టు తీర్పునిచ్చింది. ఇప్పటికే కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ విచారణ ఖైదీగా ఉన్న ప్రజ్వల్ రేవణ్ణ 14 నెలల పాటు జైలు గోడల మధ్యే ఉన్నాడు. తాజాగా ఆయనకు శిక్ష ఖరారు కావడంతో ప్రజ్వల్ రేవణ్ణ రాజకీయ జీవితానికి ము గింపు పడినట్టే. కాగా జడ్జీ తీర్పు చెప్పే సమయంలో ప్రజ్వల్ రేవణ్ణ తనకు శిక్ష తగ్గిం చాలంటూ బిగ్గరగా ఏడ్వడం గమనార్హం. జీవిత ఖైదు పడిందని తెలియగానే కోర్టు హా ల్‌లోనే కన్నీరు మున్నీరయిన ప్రజ్వల్ న్యా యస్థానం నుంచి బయటకు వచ్చాకా కూడా కంటతడిపెట్టాడు.
ప్రజ్వల్ రేవణ్ణ కేసు నేపథ్యం..
మైసూరు జిల్లా కేఆర్ నగర్‌కు చెందిన 48 ఏళ్ల ఒక మహిళ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా గత ఏడాది ఏప్రిల్ 28న ప్రజ్వల్‌పై లైంగిక దాడి కేసు నమోదైంది. హాసన్ జిల్లా హోళెనరసీపురలోని వారిక కుటుంబానికి చెందిన ఫాంహౌస్‌లో పనిచేసే మహిళ.. రేవణ్ణ తనపై 2021లో రెండుసార్లు అత్యాచారానికి పాల్పడ్డాడని ఫిర్యాదులో పేర్కొ న్నారు. ఫాంహౌస్‌తో పాటు బెంగళూరు బసవనగుడిలోని ఆయన తండ్రి నివాసంలోనూ రేవణ్ణ పలుమారలు అత్యాచారం చేసినట్టు బాధితురాలు పేర్కొన్నారు.
ఈ దురాగతాన్ని మొబైల్ ఫోన్‌లో వీడియో తీసి బెదిరింపులకు పాల్పడినట్టు తెలిపారు. ఈ క్రమంలో ప్రజ్వల్ కేసు దర్యాప్తు కోసం ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. ఈ క్రమం లో బాధితురాలిని ప్రజ్వల్ తండ్రి రేవణ్ణ, తల్లి భవాని కిడ్నాప్ చేశారు. సిట్ పోలీసులు 2024 సెప్టెంబర్‌లో ఆమెను రక్షించారు. అంతకముందు మహిళలపై లైంగిక వేధింపులకు సంబంధించిన వీడియోలు 2024 ఏప్రిల్ 26న బయటకు రావడంతో ప్రజ్వల్ జర్మనీకి పారిపోయాడు.
ఆ తర్వాత మే 31న స్వదేశానికి తిరిగొచ్చిన ప్రజ్వల్‌ను పోలీసులు బెంగళూరు విమానాశ్రయంలోనే అరెస్ట్ చేశారు. హోలేనరసిపుర పోలీస్ స్టేషన్‌లో నమోదైన కేసులో ముమ్ముర దర్యాప్తు జరిపిన ప్రత్యేక దర్యాప్తు బృందం 1,632 పేజీలతో గతేడాది డిసెంబరులో ఛార్జిషీట్ దాఖలు చేసింది. కేసులో 113 మంది సాక్షులను విచారించినట్టు సిట్ పేర్కొంది. ఆ తర్వాత ఈ ఏడాది ఏప్రిల్ 3న ప్రజ్వల్‌పై అభియోగాలు మోపింది.
కేసులో నిందితుడిగా ఉన్న ప్రజ్వల్ రేవణ్ణ అప్పటినుంచి పరప్పన అగ్రహార సెంట్రల్ జైలులో 14 నెలలుగా విచారణ ఖైదీగా ఉంటున్నారు. తాజాగా లైంగిక దాడి కేసులో దోషిగా తేలిన ప్రజ్వల్‌కు బెంగళూరులోని ప్రజాప్రతినిధుల కోర్టు జీవితఖైదు విధిస్తూ తీర్పునిచ్చింది.
హసన్ నుంచి ఎంపీగా గెలుపు..
ప్రజ్వల్ రేవణ్ణ.. మాజీ ప్రధాని దే వగౌడ మనవడు. మాజీ మంత్రి హెచ్ డీ రేవణ్ణ తనయుడు. 2015లో జేడీఎస్‌లో చేరిన ప్రజ్వల్ 2019 ఎన్నిక ల్లో హసన్ నియోజకవర్గం నుంచి లో క్‌సభకు ఎన్నికయ్యారు. ఆ దఫా పార్లమెంట్‌లో మూడో అత్యంత పిన్నవ యసున్న ఎంపీగా ఘనత సాధించా డు.
అయితే 2023లో అఫిడవిట్ లో పాల కారణంగా (రూ.24 కోట్ల లెక్క ను చూపించకపోవడం) కర్ణాటక హై కోర్టు ఆయన ఎంపీ ఎన్నికల చెల్లదం టూ తీర్పు ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే లైంగిక దాడి కేసులో ప్రజ్వల్‌పై ఆరోపణలు రావడంతో జేడీఎస్ ఆయన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. తాజా గా కేసులో దోషిగా తేలడంతో ప్రజ్వల్ రేవణ్ణ రాజకీయ జీవితానికి తెర పడినట్టేనని రాజకీయ వర్గాలు భావి స్తున్నాయి.