23-10-2025 05:13:44 PM
భారత్ vs ఆస్ట్రేలియా: ఆస్ట్రేలియాలోని అడిలైడ్ వేదికగా జరిగిన రెండో వన్డే మ్యాచులో భారత్ పై ఆస్ట్రేలియా విజయం సాధించింది. 265 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసిస్.. 8 వికెట్ల కోల్పోయి 46.2 ఓవర్లలో మ్యాచును ముగించంది. దీంతో మూడు వన్డేల సీరిస్ లో 2-0 ఆధిక్యంలో ఆస్ట్రేలియా నిలిచింది. ఆస్ట్రేలియా బ్యాటర్లలో మాథ్యూ షార్ట్(74), మ్యాట్ రెన్షా(30), కూపర్ కన్నోలి(61), మిచెల్ ఓవెన్(36) పరుగులతో రాణించి విజయంలో కీలక పాత్ర పోషించారు.
భారత బౌలర్లలో అర్షదీప్, హర్షిత్ రాణా, వాషింగ్టన్ సుందర్ తలో రెండు వికెట్లు తీశారు. తొలుత టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 264 పరుగులు చేసింది. రోహిత్ శర్మ(73), శ్రేయస్ అయ్యర్(61) హాఫ్ సెంచరీలతో అదరగొట్టారు. అక్షర్ పటేల్ (44), హర్షిత్ రాణా(24), అర్షదీప్(13) పరుగులు చేశారు. ఆస్ట్రేలియా బౌలర్లలో ఆడమ్ జంపా 4, బార్ట్ లెట్ 3, మిచెల్ స్టార్క్ 2 వికెట్లు తీసుకున్నారు.