calender_icon.png 23 October, 2025 | 10:11 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యార్థిని పట్ల ఉపాధ్యాయుడు లైంగిక వేధింపులు..

23-10-2025 05:42:44 PM

ఫోక్సో కేసు నమోదు..

తాండూరు (విజయక్రాంతి): విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ఉపాధ్యాయుడు కామంతో కళ్ళు మూసుకుపోయి వక్ర బుద్ధితో కళ్ళు నెత్తికెక్కి విద్యార్థినితో అసభ్యంగా ప్రవర్తించి కటకటాల వెనక్కి వెళ్ళాడు. కరణ్ కోట్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం తాండూరు మండల పరిధిలోని ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న బాలిక, అదే పాఠశాలలో సామాన్య శాస్త్రం బోధించే ఉపాధ్యాయుడు రాఘవేందర్ రెడ్డి లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. వేధింపుల విషయాన్ని బాలిక తల్లిదండ్రులకు తెలుపడంతో ఉపాధ్యాయుడికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. ఈ మేరకు సదరు ఉపాధ్యాయుడు రాఘవేందర్ రెడ్డిపై ఫోక్సో కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.