calender_icon.png 23 October, 2025 | 10:10 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వినీష్ రావును అభినందించిన నరేందర్ రెడ్డి

23-10-2025 05:39:24 PM

సుల్తానాబాద్ (విజయక్రాంతి): సుల్తానాబాద్ పట్టణంలోని ఆల్ఫోర్స్ ఉన్నత పాఠశాలకు చెందిన పదవ తరగతి విద్యార్థి వినీశ్ రావు మహారాష్ట్ర రాష్ట్రంలోని శిరిడి నగరంలో ఇటీవల జరిగిన 28వ జాతీయ స్థాయి సబ్ జూనియర్ టగ్ ఆఫ్ వార్ పోటీల్లో పాల్గొనడం గర్వకారణం అని పాఠశాల చైర్మన్  వి. నరేందర్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా గురువారం విద్యార్థిని అభినందిస్తూ, “గ్రామీణ ప్రాంతాల నుండి జాతీయ స్థాయికి ఎదుగుతున్న విద్యార్థులు తమ కృషి, పట్టుదలతో పాఠశాలకు గర్వకారణమవుతున్నారు అని అన్నారు. పాఠశాల ప్రిన్సిపల్, ఉపాధ్యాయులు, విద్యార్థులు వినీశ్ రావుకు  శుభాకాంక్షలు తెలుపుతూ, భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.