calender_icon.png 23 October, 2025 | 10:01 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సీఐటీయూ కన్వీనర్ గా తాండ్ర అంజయ్య

23-10-2025 05:25:41 PM

సుల్తానాబాద్ (విజయక్రాంతి): సుల్తానాబాద్ మండల సీఐటీయూ కన్వీనర్ గా తాండ్ర అంజయ్యను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మండల సీఐటీయూ జనరల్ బాడీ సమావేశం స్థానిక ఐబి గెస్ట్ హౌస్ లో గురువారం నిర్వహించారు, సమావేశానికి ముఖ్య అతిథిగా సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఎరవెల్లి ముత్యం రావు హాజరై మాట్లాడుతూ నిరంతరం కార్మిక సమస్యలపై పోరాడే సీఐటీయూ జిల్లా మహాసభలు నవంబర్ 15, 16 తేదీల్లో రెండు రోజులు పెద్దపల్లి పట్టణంలో నిర్వహిస్తామని, మహాసభల నిర్వహణకు అన్ని రంగాల కార్మికులు, ఉద్యోగులు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం సుల్తానాబాద్ సీఐటీయూ మండల కమిటీని ఎన్నుకున్నారు, మండల కన్వీనర్ గా తాండ్ర అంజయ్య, కమిటీ సభ్యులుగా బ్రహ్మచారి, పూసాల సంపత్,మాతంగి రాజమల్లు, భగవాన్, ప్రశాoత్, ఆరేపల్లి సురేష్, ఎండి మంజూర్, ఆవునూరి కుమార్, పోగుల తిరుపతి, గున్నాల అన్నపూర్ణ, తుడిచెర్ల స్వరూప, నరసింగం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.