04-10-2025 04:03:31 PM
హైదరాబాద్: యాదాద్రి భువనగిరి జిల్లాలోని యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి భక్తుల రద్దీ గణనీయంగా పెరిగింది. వరుస సెలవుల వల్ల యాదగిరిగుట్టకు అధిక సంఖ్యలో భక్తులు భారీగా తరలి వచ్చారు. యాదాద్రిలో స్వామివారిని దర్శించుకోడానికి రెండు గంటల సమయం, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి గంట సమయం పడుతుంది. భక్తులు స్వామివారికి ప్రత్యేకంగా కుంకుమార్చనలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ పరిసరాలు భక్తజనసంద్రంగా మారాయి.