calender_icon.png 4 October, 2025 | 6:06 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రిజర్వేషన్ కల్పించండి సారూ...

04-10-2025 04:37:29 PM

జనగామ,(విజయక్రాంతి): జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం కోడూరు గ్రామంలో ఎస్సీ రిజర్వేషన్ రాకపోవడంతో స్థానిక పోరులో ముందజంలో ఉందామనుకున్న ఎస్సీలకు సర్పంచ్, వార్డ్ మెంబర్ ఆశావాహులకు రిజర్వేషన్ లు షాక్ కి గురిచేశాయి. 2001 జనాభా లెక్కల ప్రకారం... 480 ఓట్లు ఎస్సీ కులస్తులు ఉండగా ఇందులోని  400 ఓట్లు కొందరి తప్పిదం వల్ల బీసీ కులంలో చూపించడంతో కోడూరు గ్రామ ఎస్సీలకు  దాదాపు 40 సంవత్సరాలుగా రిజర్వేషన్ కలిసి రావడంలేదు ఇందుకు గాను కోడూరు గ్రామ ప్రజలు పార్టీ లకు, కులాలకు అతీతంగా ఎమ్మార్వో,  ఎంపీడీవో  అధికారులను కలిసి చట్ట పరమైన సవరణలు చేసి ఎస్సీలకు రిజర్వేషన్ కల్పించాలని వినతి పత్రం అందజేయడం జరిగింది.