04-10-2025 03:51:39 PM
ఇల్లెందు,(విజయక్రాంతి): ఇల్లందు మండల విద్యాధిశాఖాదికారి ఎం.ఉమాశంకర్ శనివారం పలు పాఠశాలలను ఆకస్మిక తనిఖీ చేశారు. దసరా సెలవుల అనంతరం శనివారం పాఠశాలలు పునః ప్రారంభం అయ్యాయి. ఇల్లందు మండలంలోని ఎంపీపీఎస్ అన్నారం, ఎంపీపీఎస్ మొదుగులగూడెం, ఎంపీపీఎస్ మొట్లగూడెం, ఎంపీపీఎస్ సంజయనగర్ పాఠశాలలను తనిఖీ చేశారు. అన్నారం పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని తనిఖీ చేయగా, సంజయ్ నగర్ పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడు దసరా సెలవుల అనంతరం పాఠశాలకు హాజరు కానందుకు మెమో ఇచ్చినట్లు తెలిపారు. ఉపాధ్యాయులు సమయపాలన పాటించాలని, మెనూ ప్రకారం మధ్యాహ్న భోజనం విద్యార్థులకు అందించాలని తెలిపారు.