calender_icon.png 4 October, 2025 | 2:06 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

క్రికెట్‌లో ఈ చిన్నారి చిచ్చర పిడుగు

04-10-2025 12:25:48 AM

-క్రీడలో రాణిస్తున్న ఏడేళ్ల బాలుడు దక్షిత్  

-ఎలాంటి శిక్షణ లేకుండానే పరుగుల వరద కురిపించిన వైనం

హైదరాబాద్, అక్టోబర్ 3 (విజయక్రాంతి) : మూడో తరగతి చదవుతున్న ఏడేళ్ల బాలుడు క్రికెట్ ఆటలో అత్యంత ప్రతిభ కనబర్చుతున్నాడు. క్రికెట్‌లో ఎలాంటి శిక్షణ తీసుకోకుండానే దక్షిత్ బత్తాల అనే బాలుడు  అండర్ లో 137 బాల్స్ అడి 65 పరుగులు సాధించి క్రికెట్ అభిమానుల మనసును చూరగొన్నాడు.

క్రికెట్ తొలి బ్యాట్స్‌మెన్‌గా రంగంలో దిగిన దక్షిత్ 50 ఓవర్లకు గాను చివరి వరకు క్రిజ్‌లో నిలిచాడు. క్రికెట్ టీమ్‌లో దక్షిత్ కంటే ఎక్కువ వయసు వాళ్లే ఉండటం విశేషం. దక్షిత్‌కు క్రికెట్‌లో అత్యంత ప్రతిభ కనబరస్తుండటంతో మాదాపూర్‌లోని ఎంఎస్‌కే అకాడమీలో క్రికెట్‌లో శిక్షణ కోసం చేర్చినట్లు దక్షిత్ తాతయ్య గిరిబాబు, తండ్రి ఉదయి తేజ ‘విజయక్రాంతి’కి తెలిపారు.

తిరుపతికి చెందిన వీరి కుటుంబం హైదరాబాద్‌లో ఉంటున్నారు. విద్యార్థి దక్షిత్ ఇండియన్ క్రికెట్‌లో ఆడాలనే కోరిక ఉందని, ఆదిశగా అతనిని తీర్చిదిద్దుతామని వారు తెలిపారు. సచిన్, విరాట్ కోహ్లీని ఆదర్శమని దక్షిత్ పేర్కొన్నారు.