10 May, 2026 | 11:42 PM

Breaking News

సింగిరెడ్డిపల్లి యువకుని దారుణ హత్య   •   అక్రమ పశువుల రవాణాపైన సరిహద్దు చెక్ పోస్టులో పటిష్ట నిఘా   •   మోడీ సభకు తరలి వెళ్లిన నాగిరెడ్డిపేట బిజెపి నాయకులు   •   మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో కేంద్ర సహాయ మంత్రి దిష్టిబొమ్మ దగ్ధం   •   125 వారాలు పూర్తి అయిన హనుమాన్ చాలీసా పారాయణం   •   బండి భగీరథను వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం అరెస్ట్ చేయాలి   •   మద్నూర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునికి నాయకుల ఘన సన్మానం   •   కామారెడ్డి రక్తదాతల సమూహం, ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ కు అవార్డుల పంట   •   అమ్మవారి ఆలయంలో కమిషనర్ పూజలు   •   కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులుగా ఎన్నికైన బజ్జూరి వెంకటరెడ్డి   •  

ఓయూలో ఇండియన్ బ్యాంక్ వాకథాన్

08-08-2024 03:21 AM

హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 7 (విజయక్రాంతి): ఇండియన్ బ్యాంక్ ఆధ్వర్యంలో ఉస్మానియా యూనివర్సిటీలో బుధవారం వాకథాన్ నిర్వహించింది. జూలై 13వ తేదీ నుంచి ఆగస్టు 13 వరకు సీఏ/ఎస్‌బీ/ఆర్టీడీలో రిటైల్ డిపాజిట్లపై ప్రత్యేక దృష్టిసారించి డిపాజిట్ల సమీకరణ కోసం ప్రచారం నిర్వహిస్తున్నట్లు బ్యాంక్ అధికారులు వెల్లడించారు. ఈ సందర్భంగా ఆర్ట్స్ కాలేజీ సమీపంలో ఫ్లకార్డులను ప్రదర్శించి, కరపత్రాలు పంపిణీ చేశారు. 1907 ఆగస్టు 15న ఇండియన్ బ్యాంక్ ప్రారంభమైందని, ఈ ఏడాదితో 118వ సంవత్సరంలో అడుగుపెట్టబోతున్నట్లు బ్యాంక్ ప్రతినిధులు తెలిపారు. రిటైల్ డిపాజిట్ ఉత్పత్తులను పెంపొందించుకొని సంస్థను అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని చెప్పారు. చీఫ్ జనరల్ మేనేజర్ సుధాకరరావు, హైదరాబాద్ ఎఫ్‌జీఎమ్ జీ రాజేశ్వరరెడ్డి, జోనల్ మేనేజర్ ఎస్ శ్రీనివాస్‌రావుతో పాటు ఇతర అధికారులు, బ్రాంచ్ మేనేజర్లు, సిబ్బంది పాల్గొన్నారు.