17 April, 2026 | 8:35 PM

Breaking News

సోనాల బస్టాండ్ లో చలివేంద్రం ఏర్పాటు   •   ప్రాథమిక ఆరోగ్య వైద్య కేంద్రంలో అరైవ్-అలైవ్ సేఫ్టీపై అవగాహన   •   మా పట్టా భూమిలో ఎటువంటి నిర్మాణం చేపట్టొద్దు: పుట్ట వెంకటమ్మ   •   ప్రభుత్వమే మమ్ములను సమ్మెలోకి నెట్టుతుంది   •   స్థలం కేటాయిస్తే బస్టాండ్ నిర్మాణం కోసం కృషి చేస్తాం   •   మున్సిపల్ కార్యాలయం వద్ద చలివేంద్రం ప్రారంభించిన మున్సిపల్ చైర్మన్ రాజు   •   పీజీ, ఎంబీఏ, ఎంసీఏ కోర్సులకు నాల్గవ సెమిస్టర్ పరీక్ష రుసుము నిర్ధారణ   •   ఉద్యమ రిజిస్ట్రేషన్ గురించి వివోఏలకు అవగాహన   •   శాతవాహనలో నల్ల బ్యాడ్జీలతో నిరసన   •   మల్లాపూర్‌లో బీజేపీ ఎంపీ దిష్టిబొమ్మ దహనం   •  

రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి క్షీరాభిషేకం

03-05-2025 01:41 AM

మహబూబాబాద్, మే 2 (విజయ క్రాంతి): భారతదేశవ్యాప్తంగా కుల గణన చేయడానికి కృషి చేసిన  పార్లమెంటులో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటాలకు మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో పట్టణ అధ్యక్షుడు గణపురం అంజయ్య ఆధ్వర్యంలో క్షీరాభిషేకం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలకు ముందు బీసీ లిక్వేషన్ సభలో ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ పూల గణన చేయాలని చెప్పిన సందర్భంగా పార్లమెంటులో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కుల గణనకు తీవ్ర కృషి చేశారన్నారు.

రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే సీఎం రేవంత్ రెడ్డి బీసీ కులగణన చేయడం జరిగిందన్నారు. కాంగ్రెస్ పోరాట ఫలితంగానే 11 ఏళ్ల తర్వాత బిజెపి ప్రభుత్వం కుల గణనకు ముందుకు వచ్చిందని చెప్పారు. బీసీ కుల గణన వల్ల రిజర్వేషన్లు పెరిగి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ నాయకులు రామదాసు, శ్రీనివాస్, యాకూబ్, చిరంజీవి, దేవ్ సింగ్, రాజమ్మ, సరస్వతి, రంజిత్, పరశురాం, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.