01-01-2026 01:46:26 AM
టెస్టుల్లో గిల్ దూకుడు
ఐసీసీ ర్యాంకింగ్స్‌లో భారత్ హవా
దుబాయి, డిసెంబర్ 31 : ఏడాది చివరి రోజు ప్రకటించిన ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్‌లో భారత ఆటగాళ్లు దుమ్మురేపారు. వన్డేల్లో రోకో జోడీ టాప్ నిలిస్తే, టెస్టుల్లో శుభమన్ గిల్ టాప్ రీఎంట్రీ ఇచ్చాడు. ప్రస్తుతం వన్డే ఫార్మాట్‌లో మాత్రమే కొనసాగుతున్న రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ 2025లో ఆడింది కొన్ని మ్యాచ్‌లే అయి నా అదరగొట్టారు. వన్డే ప్రపంచకప్‌లో ఆడడమే లక్ష్యంగా తమ ఫామ్ కొనసాగించారు. ఆసీస్ టూర్‌లోనూ తర్వాత సౌతాఫ్రికాపైనా దుమ్మురేపారు. ఈ ప్రదర్శనలతోనే ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్ లోనూ ఆధిపత్యం కనబరిచారు. చాలా రోజుల తర్వాత రోకో జోడీ టాప్‌ణి ఏడాదిని ముగించింది. రోహిత్ శర్మ 781 రేటింగ్ పాయింట్లతో అగ్రస్థానంలో నిలిస్తే... కోహ్లీ 773 రేటింగ్ పాయింట్లతో రెండో స్థానంతో 2025ను ముగించాడు.
ఈ క్రమంలో కోహ్లీ అరుదైన రికార్డును అందుకున్నాడు. ఐసీసీ ర్యాంకింగ్స్ చరిత్రలో అత్యధిక సార్లు టాప్ ఏడాదిని ముగించిన ఆటగాడిగా రికార్డులకెక్కాడు. గతంలో వివ్ రిచర్డ్స్, షాన్ పొలాక్ మాత్రమే ఈ ఘనత సాధించారు. కాగా వన్డే ర్యాంకింగ్స్ టాప్ 10లో మరో ఇద్దరు భారత ఆటగాళ్లు చోటు దక్కించుకున్నారు. శుభమన్ గిల్ ఐదో స్థానంలోనూ, శ్రేయాస్ అయ్యర్ 10వ స్థానంలోనూ ఏడాదిని ముగించారు. ఇదిలా ఉంటే టెస్ట్ ఫార్మాట్‌లో శుభమన్ గిల్ టాప్ దూసుకొచ్చాడు. గిల్ టెస్టుల్లో అద్భుతంగా రాణించి 2025లో 983 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అలాగే జైస్వాల్ టెస్టుల్లో 8వ స్థానంతో ఏడాదిని ముగించాడు. బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో బుమ్రా అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్నాడు.