04-10-2024 12:00:00 AM
ఐఎస్‌ఎస్‌ఎఫ్ షూటింగ్
లిమా (పెరూ): ఐఎస్‌ఎస్‌ఎఫ్ జూనియర్ షూటింగ్ ప్రపంచకప్‌లో భారత్ ఖాతాలో 15వ పతకం వచ్చి చేరింది. మహిళల 50 మీటర్ల రైఫిల్ పొజిషన్ ఈవెంట్‌లో ఖుషి కాంస్యం పతకం సాధించింది. 15 పతకాల్లో 10 స్వర్ణాలు సహా ఒక రజతం, నాలుగు కాంస్యాలున్నాయి. ఇక గురువారం జరిగిన ఫైనల్లో ఖుషి 447.3 పాయింట్లు స్కోరు సాధించింది. నార్వే కు చెందిన బెర్గ్, కరోలిన్ వరుసగా స్వర్ణ, రజతాలు కైవసం చేసుకున్నారు.